నారాయణపేట: ఉట్కూరు మండలం బిజ్వారం గ్రామంలోనీ అంబత్రయ క్షేత్రంలో ఈనెల 22 నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్టు క్షేత్ర వ్యవస్థాపకులు ఆదిపరశ్రీ స్వామి ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలు ఉంటాయన్నారు. ఉత్సవాల సందర్భంగా భజనలు, నాట్య ప్రదర్శనలు, నృత్యాలు ఉంటాయని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు.