NLR: 2025వ సంవత్సరం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పాన్ ఇండియా ఐకానిక్ అవార్డుకు సీతారామపురం వాసి దాసరి నరేష్ ఎంపికయ్యారు. ఉపాధ్యాయ వృత్తిలో సుదీర్ఘ అనుభవం కలిగి, విద్యార్థులకు విభిన్న పద్ధతులలో బోధను అందిస్తూ ఆయన అందరి ప్రశంసలను అందుకున్నారు. ఆదివారం ఈ అవార్డును ఆయన అందుకోవడం జరిగింది. పలువురు అభినందనలు తెలియజేశారు.