GDWL: జిల్లా కేంద్రంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది. రోడ్లపై ప్రయాణించాలంటే ప్రజలు భయపడుతున్నారు. మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. సెకండ్ రైల్వే గేట్, నందీశ్వర ఆలయం, వెంకటరమణ కాలనీ, భీంనగర్, మోమిన్ మల్లా, నల్లకుంట, రాఘవేంద్ర కాలనీ వంటి ప్రాంతాల్లో కుక్కల గుంపులు సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.