కృష్ణా: గన్నవరం పట్టణంలో పలు ప్రాంతాల్లో నేడు కరెంట్ ఉండదని అధికారులు తెలిపారు. పట్టణంలోని శాంతి సినిమా హాల్, గవర్నమెంట్ హాస్పిటల్, గౌడ పేట, సొసైటీ పేట, గాంధీ బొమ్మ సెంటర్, గన్నవరం తహసీల్దార్ ఆఫీస్ ప్రాంతాల్లో కరెంట్ ఉండదని చెప్పారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కరెంటు ఆపివేయనున్నట్లు అధికారులు చెప్పారు.