JGL: మహాశక్తి నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం సాయంత్రం ఆవిష్కరించారు. విజయదశమి పర్వదినం సందర్భంగా నిర్వహించే వేడుకలకు రావాలని మంత్రిని ఆహ్వానించినట్లు ధర్మపురికి చెందిన మహాశక్తి సేవా సమితి సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా కరపత్రాన్ని ఆవిష్కరింపజేసినట్లు చెప్పారు.