VZM: ఎస్.కోట మండలంలో దొంగలు హల్చల్ చేశారు. ఆదివారం రాత్రి ఎస్.జి పేటలోని యల్లారమ్మ తల్లి ఆలయంలో దొంగలు హుండీ చోరీ చేసినట్లు స్థానికులు తెలిపారు. అదేవిధంగా వినాయక పల్లిలో అదే రోజు రాత్రి బ్రహ్మం రివైండింగ్ షాపు తాళాలు విరగొట్టి సామగ్రి దొంగలించినట్లు షాపు యజమాని బ్రహ్మం పేర్కొన్నారు. వరుస దొంగతనాలు జరగడంతో స్థానికుల భయాందోళనకు గురవుతున్నారు.