ప్రకాశం: ఒంగోలులోని డీటీసీలో సీఐగా పనిచేస్తున్న సమీముల్లాను సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీ ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ పాలనలో మాచర్ల సీఐగా సమీముల్లా పనిచేసిన సమయంలో పలుకేసుల్లో అక్రమాలకు పాల్పడ్డారు. వీటిపై విచారణ చేపట్టిన పోలీస్ శాఖ.. అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.