సంగారెడ్డి: పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టుకు వరద పెరగడంతో ఆదివారం రాత్రి మూడు గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలినట్లు ప్రాజెక్టు DEE నాగరాజు సోమవారం ఉదయం తెలిపారు. యావరేజ్ ఇన్ఫ్లో 17,277 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 16,512 క్యూసెక్కులు నీరు బయటికి వెళ్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, 17.560 టీఎంసీల నీటిమట్టంకు చేరిందన్నారు.