VZM: గ్లోబల్ సమ్మిట్లో ప్రపంచ దేశాలను ఆకట్టుకున్నామని, త్వరలో రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సీఎం చంద్రబాబు ఒక బ్రాండ్ అని, ఆయన్ను చూసే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమవుతున్నారని కొనియాడారు. తమ క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియా సమావేశాన్ని నిర్వహించారు.