ADB: పట్టణంలోని బట్టి సవర్గం శివారులో నిర్మాణ దశలో ఉన్న నూతన కలెక్టరేట్ పనులను నేతలతో కలిసి ఆదివారం మాజీమంత్రి జోగురామన్న పరిశీలించారు. పనుల జాప్యానికి ప్రభుత్వ అసమర్థతే కారణమని మండిపడ్డారు. వెంటనే నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. జోగురామన్న మాట్లాడుతూ… BRS ప్రభుత్వ హయాంలో కలెక్టరేట్ నిర్మాణానికి రూ.55 కోట్ల నిధులు మంజూరు అయ్యాయన్నారు.