KKD: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ లోవ దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది.సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఒక్క రోజులోనే దాదాపు 16వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని, దేవస్థానానికి రూ. 6.14 లక్షల ఆదాయం లభించిందని ఆలయ ఈవో తెలిపారు.