MNCL: బెల్లంపల్లి మండలంలోని బుధకుర్ద్ గ్రామపంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేయవద్దని కోరుతూ.. గ్రామస్థులు సోమవారం తహశీల్దార్ కృష్ణకు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని తహశీల్దార్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు రాజలింగు, శ్రీనివాస్, పోషం, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.