కాసేపట్లో పాకిస్తాన్‌తో జరిగే క్రికెట్ మ్యాచ్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితులకు సంఘీభావంగా ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, పాక్ ప్లేయర్లతో భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్‌కు కూడా దూరంగా ఉండనున్నట్లు సమాచారం.