ఆసియా కప్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచింది. దీంతో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్తో జరుగుతున్న మ్యాచ్ కావడంతో అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, ఈ మ్యాచ్లో గెలిచి సూపర్-4కు అర్హత సాధించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.