KNR: మంత్రి పొన్నం ప్రభాకర్ కాన్వాయ్కి ఆదివారం సాయంత్రం పెద్ద ప్రమాదం తప్పింది. కరీంనగర్లో పర్యటనలు ముగించుకొని సిద్దిపేట మీదుగా హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో కుకునూరుపల్లి వద్ద కాన్వాయ్ లోని ఓ వాహనం డివైడర్ పైకి దూసుకెళ్లింది. వాహనంలో పొన్నం ప్రభాకర్ సహాయకుడు మంజునాథ్, ఫోటో గ్రాఫర్, అటెండర్, గన్ మెన్ సాంబశివరావులు ఉన్నారు.