GNTR: గుంటూరు నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయిందని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి, ముంపు ప్రాంతాల నుంచి నీటిని బెయిల్ అవుట్ చేయాలని సూచించారు.