KMM: తల్లాడ మండల కేంద్రంలో కోతులు, కుక్కల బెడద రోజురోజుకు ఎక్కువవుతుందని స్థానికులు తెలిపారు. రోడ్డుపై వెళ్తున్న వారిపై కుక్కలు, కోతులు దాడి చేసి గాయపరిచిన ఘటన ఇటీవల కాలంలో చోటుచేసుకున్నాయని చెప్పారు. వీటి వల్ల బయటకు రావాలంటేనే భయంగా ఉందన్నారు. ఈ విషయంపై అధికారులు దృష్టి సారించి కోతులు, కుక్కలను తరిమి కొట్టే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు.