NZB: బోధన్‌లోని ఇందూరు మోడల్ స్కూల్ సమీపంలో మురికి కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పట్టణ సీఐ వెంకట్ నారాయణ ఆదివారం తెలిపారు. మృతుడి జేబులో ఆధార్ కార్డు ఆధారంగా ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన నిర్మల్ లక్ష్మణ్‌గా గుర్తించారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్నిప్రభుత్వాసుపత్రికి తరలించారు.