MBNR: స్థానిక సంస్థలు, ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 20న నాగర్ కర్నూల్ జిల్లాలో “బీసీ హక్కుల శంఖారావం-రాష్ట్ర సదస్సు”నిర్వహించనున్నారు. “మన తెలంగాణ బీసీ మహాసభ” వ్యవస్థాపక అధ్యక్షుడు కొమ్ము శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సదస్సు పోస్టర్ను ఆదివారం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.