SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఆదివారం విశాఖపట్నంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువ కప్పి సత్కరించారు. గ్రామీణ ప్రాంతంలో కమలం గుర్తుపై విజయం సాధించడంపై నడ్డా అభినందనలు తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని నడ్డా సూచించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.