KDP: సిద్దవటం పెన్నానది హైలెవెల్ వంతెనపై వినాయకుడి విగ్రహాల నిమజ్జనం కోసం ఓవైపు మట్టి రహదారి ఏర్పాటు చేసి గణనాథుడి నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించారు. వినాయకుడి ఉత్సవాల అనంతరం మట్టి కుప్పలు తొలగించకపోవడంతో వాహదారులు ఇబ్బంది పడ్డారు. ఆదివారం సర్పంచ్ బవనాసి నాగరాణి ఆధ్వర్యంలో ఎక్స్ లెటర్ యంత్రాలతో మట్టి కుప్పలను తొలగించారు.