ఈశాన్య రాష్ట్రం అసోంలో భూకంపం సంభవించింది. తీవ్రత రిక్టార్ స్కేలుపై 5.9గా నమోదైంది. అసోంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ రాష్ట్రంతో పాటు మయన్మార్, చైనా, భూటాన్, బంగ్లాదేశ్‌లోనూ భూప్రకంపనలు సంభవించాయి. కుదుపులతో ఒక్కసారిగా భయపడిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.