NRPT: జిల్లా జల సాధన సమితి సభ్యులు ఆదివారం మక్తల్ పట్టణంలోని మంత్రి వాకిటి శ్రీహరిని ఆయన నివాసంలో కలిశారు. నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులకు నష్టపరిహారం పెంచడంతో మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కో కన్వీనర్ నరసింహ మాట్లాడుతూ.. నిర్వాసిత రైతులకు ఎకరాకు రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలు పెంచి న్యాయం చేశారని అన్నారు.