ప్రకాశం: కర్నూల్లో ఆదివారం జరిగిన 12వ నేషనల్ లెవెల్ కరాటే ఛాంపియన్ షిప్ 2025 పోటీల్లో గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య పిల్లలు సత్తా చాటారు. భవ్యంశ్ రామ్ అత్యుత్తమ ప్రతిభతో రెండవ స్థానంలో, వర్షిణి మూడవ స్థానంలో నిలిచి పతకాలు సాధించారు. వీరిద్దరు ఇప్పటికే ఎన్నో పతకాలు సాధించి, బాల్యంలోనే కరాటేలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు.