E.G: తెలుగు పాటకు ప్రపంచ ఖ్యాతిని తీసుకొచ్చిన గొప్ప గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. ఆదివారం ధవళేశ్వరంలో ఎస్పీబీ విగ్రహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. గాయకునిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా, డబ్బింగ్ కళాకారుడిగా ఆయన తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఎస్పీబీ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.