NLR: రాపూరు మండలంలోని సిద్దవరం జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. తిరుపతి వైపు వెళ్తున్న ఓ కారు ఆవును ఢీకొట్టడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదాన్ని గమనించిన చుట్టుపక్కల స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.