అన్నమయ్య: రైల్వేకొడూరు మండలంలోని బొజ్జవారిపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం ముగ్గురు గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి1.7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ CI తులసి పేర్కొన్నారు. కోడూరు మండలానికి చెందిన రాజేష్, హరి, సుమన్ గంజాయి వ్యాపారం చేస్తుండగా కడప ఎక్సైజ్ ఎన్పోర్స్మెంట్ CI నీలకంఠారెడ్డి నిందితులను పట్టుకున్నట్లు చెప్పారు.