సహజీవనం చేసిన తర్వాత పెళ్లికి నిరాకరించడం నేరం కాదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తనపై అత్యాచారం జరిగిందని ఓ మహిళ తన సహజీవన భాగస్వామిపై వేసిన కేసును కోర్టు కొట్టివేసింది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో 4 ఏళ్లుగా సహజీవనం చేశారని కోర్టు పేర్కొంది. రెండేళ్లకు మించి సహజీవనం చేస్తే, ఆ బంధం స్వచ్ఛందంగా ఏర్పడిందని భావించాలని కోర్టు అభిప్రాయపడింది.