WGL: నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామంలో BJP జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణాప్రతాపరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు పార్టీలకు చెందిన నేతలు ఆయన సమక్షంలో BJP పార్టీలో చేరారు. రాణాప్రతాపరెడ్డి మాట్లాడుతూ.. రాబోయే స్థానిక ఎన్నికల్లో కష్టపడి పనిచేసి విజయం సాధించాలని, కేంద్రం ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి క్యాడర్ పని తీరును మెరుగుపరచాలని తెలిపారు.