TG: MBA, MCA కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన TGICET ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఈరోజు నుంచి మొదలవుతుంది. ఈరోజు రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ చేయాలి. స్లాట్ బుక్ చేసుకున్న వారికి రేపు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. అక్టోబర్ 16, 17 తేదీల్లో వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చు. సీట్ల కేటాయింపు అక్టోబర్ 20న ఉంటుంది. మరింత సమాచారం కోసం WWW.TGICET.NIC.IN ను సందర్శించవచ్చు.