KRNL: జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వేదవతి, హగరి ఉపనదుల నుంచి వరద ఉధృతి ఎక్కువ కావడంతో తుంగభద్ర జలాశయం నిండిపోయింది. తుంగభద్ర నది కూడా పొంగి ప్రవహిస్తోంది. కోసిగి మండలం ఆర్డీఎస్ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, కౌతాళం మండలం మేడిగనూరు రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద నది ప్రవాహం అధికంగా ఉంది.