VZM: రాష్ట్ర హోటల్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు జి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలువురు అసోసియేషన్ సభ్యులు ఆదివారం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును శ్రీకాకుళంలో కలిశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక, పాలకవర్గం అంశాలపై చర్చించారు. అనంతరం ఈనెల 18 నుంచి 20 వరకు బెంగళూరులో జరిగే జాతీయస్థాయి FRHA సమావేశానికి హాజరుకావాలని మంత్రిని ఆహ్వానించారు.