KDP: సింహాద్రిపురం నుంచి వెలిదండ్లకు వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారింది. గతుకుల రోడ్డుతో ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో గుంతల రోడ్డు కాస్త రొచ్చుగా మారింది. దీంతో వాహనదారులు ఆ రోడ్డుపై వెళ్లేటప్పుడు అదుపు తప్పి కింద పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతల రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని స్థానికులు కోరారు.