KNR: సత్తుపల్లిలో తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల హాస్టల్ కార్మికులు ఆదివారం సమ్మె కొనసాగించారు. నిరసనలో భాగంగా కార్మికులు మోకాళ్లపై నిలబడి ఆందోళన వ్యక్తం చేశారు. విరుద్ధమైన జీవోలను రద్దు చేసి, పాత పద్ధతిలో వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా నేత కొలికపోగు సర్వేశ్వరరావు డిమాండ్ చేశారు. కార్య క్రమంలో సుశీల, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.