SKLM: పాడిపశువులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న నాడే పాడి రైతులకు ఆదాయం సమృద్ధిగా లభిస్తుందని ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు తెలిపారు. ఇవాళ జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం లో భాగంగా పశువులకు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పశు వ్యాధుల నియంత్రణ ద్వారా పాల ఉత్పత్తి మెరుగుపడుతుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.