SKLM: సారవకోట మండలం చీడిపూడి గ్రామంలో యువత ఆధ్వర్యంలో గ్రామ స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం ఉదయం గ్రామంలోని యువకులందరూ గ్రామ పరిసరాలలోని చెత్తాచెదారం తొలగించి ఊరికి దూరంగా డంపింగ్ యార్డ్‌కు తరలించారు. మురుగు కాలువలను శుభ్రపరిచారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు.