అన్నమయ్య: రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలం తుమ్మకొండ గ్రామానికి చెందిన దేవల్ల మణి ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయి కష్టాలొచ్చిన వేళ, ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ తరఫున రూ. 50,000 ఆర్థిక సహాయం అందజేసిన ముక్కా వరలక్ష్మి గారు ఆయనను పరామర్శించారు. ఈ సహాయంతో వైద్య ఖర్చులకు కొంత ఉపశమనం లభించిందని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.