CTR: పుంగనూరు భక్తుల పాలిట ఇలవేల్పుగా ప్రసిద్ధి చెందిన గ్రామ దేవత శ్రీ వీరుపాక్షి మారెమ్మ సోమవారం శివరూపిణి అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. వేకువ జామునే అర్చకులు అమ్మవారికి పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి అలంకరించారు. అనంతరం విశేష పూజలు నిర్వహించారు. తర్వాత భక్తులు దర్శించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.