KNR : రేకుర్తిలో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. కోక్కరకుంటకు చెందిన నాగం బీరయ్య కుటుంబ కలహాల నేపథ్యంలో రేకుర్తిలోని తన గొర్రెల షెడ్డులో క్రిమి సంహారక మందు తాగగా కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు