వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చట్టంలోని మొత్తం ప్రొవిజన్లపై స్టే విధించేందుకు నిరాకరించింది. అయితే, కొన్ని సెక్షన్లపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అనంతరం ఐదేళ్లు ఇస్లాంలో ఉండాలనే నిబంధనపై స్టే విధిస్తూ తీర్పును వెలువరించింది.