PPM: పాలకొండ మండలం జగనన్న కాలనీ వద్ద డంపింగ్ యార్డ్ ఉంది. ఇక్కడే చెత్తచెదారాలును వేయడంతో వ్యర్థాలు రోడ్డుపైకి వస్తున్నాయి. ఈ దారిలో వెళ్తున్న వాహనదారులు ఆమడ దూరం నుంచే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. దీంతో స్థానికులు డంపింగ్ యార్డ్ సమీపానికి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు ఈ యార్డ్ వేరే ప్రాంతానికి తరలించాలని కోరారు.