ATP: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సోమవారం నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. తన స్వగృహంలో పట్టణంలోని 1వ వార్డు గాంధీ నగర్‌కి చెందిన లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేశారు. అనంతరం జేసీ మాట్లాడుతూ.. ఆర్థికంగా ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ, అభివృద్ధి-సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని తెలిపారు.