AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. రాష్ట్రంలో 15 శాతం వృద్ధిరేటు సాధనే లక్ష్యంగా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. మొత్తం 8 అంశాల ప్రాతిపదికన సదస్సులో చర్చలు జరగనున్నాయి. GSDP, సేవలు, పరిశ్రమలు, వ్యవసాయం, పర్యాటకం, లాజిస్టిక్స్, మౌలిక సౌకర్యాల ప్రాజెక్టులు, సంక్షేమం, సూపర్ సిక్స్, అన్న క్యాంటీన్లు, పీ4పై చర్చించనున్నారు.