NGKL: మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జయంతిని పురస్కరించుకొని హైదరాబాదులోని గాంధీభవన్లో నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, బూర్గుల రామకృష్ణారావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాకు చెందిన బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవి చేపట్టి రాష్ట్రానికి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు.