RR: షాద్నగర్ పట్టణంలోని పెన్షనర్ భవన్లో టీఎస్ యూటీఎఫ్ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జాతీయ పూర్వపు ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అసలైన వారసులు కమ్యూనిస్టులేనని తెలిపారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.