SDPT: బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీహరి అనారోగ్యంతో మృతి చెందారు. కోహెడ మండలంలోని శనిగరం గ్రామంలో మాజీ మంత్రి హరీష్ రావు ఆదివారం పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.