KDP: బీసీ సబ్సిడీ రుణాలను వెంటనే మంజూరు చేసి వాళ్ల అభ్యున్నతికి సహకరించాలని జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ జాతీయ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున తెలిపారు. ఇవాళ కడపలో మీడియా ముందు మల్లికార్జున మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం BC రుణాల నోటిఫికేషన్ విడుదల చేసి 3 నెలలు కావస్తున్నా సబ్సిడీ వేయలేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.