SKLM: తమ సమస్యల పరిష్కారానికి సహకరించాలంటూ ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు ఉపాధ్యాయులు వినతిపత్రం అందించారు. శ్రీకాకుళం క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఏపీటీఎఫ్ ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిశారు. ప్రభుత్వం తమకు చెల్లించవలసిన డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, కేంద్ర ప్రభుత్వ మేమో 57ను అమలు చేయాలని వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు.