MDK: జిల్లాలో జాతీయ మెగా లోక్ అదాలత్లో 2,446 పోలీస్ కేసులను రాజీ చేసినట్లు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఇరు వర్గాలకు సత్వర పరిష్కారం చేయడం జరిగిందని వివరించారు. 106 సైబర్ క్రైమ్ కేసులలో రూ. 24,19,680 తిరిగి బాధితుల ఖాతాలో జమ చేయడానికి బ్యాంకు నోడల్ అధికారకు ఆర్డర్ కాపీలు పంపించినట్లు తెలిపారు.