ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ మహిళల జట్టు భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ప్రతీకా రావల్ (64), స్మృతి మంధాన (58), హర్లీన్ డియోల్ (54) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కట్ 2 వికెట్లు తీయగా.. అన్నాబెల్, అలానా కింగ్, మెక్‌గ్రాత్ తలో వికెట్ తీశారు.